బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ చాలా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత డాన్సు పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. ఐతే ఫైనల్ కి చేరుకున్న ఐదుగురు కంటెస్టెంట్లలో ఇద్దరు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు. అఖిల్, అభిజిత్, సోహైల్, ఆరియానా, హారిక లలో హారిక , ఆరియానా ఎలిమినేట్ అయ్యారు. ఐదుగురిలో ముందుగా హారిక ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుతం ముగ్గురు మగవాళ్ళు మాత్రమే ఉన్నారు.
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ టైటిల్ ఈ సారి కూడా మగవాళ్లకే దక్కనుంది. మొదటి సీజన్ నుండి ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆడవాళ్ళు, ఈ సారైనా గెలుస్తారని చాలా మంది ఎదురుచూసారు. కానీ ఆ అవకాశం వారికి లేకుండా పోయింది. ఐతే ఇంకా చిత్రమేమిటంటే, ఈసారి రన్నరప్ కూడా గెలవలేకపోయారు. మొదటి సీజన్లో నుండి విజేతగా మెగవాళ్ళు గెలిస్తే రన్నరప్ గా ఆడవాళ్ళు నిలుస్తూ వచ్చారు.
విజేత శివ బాలాజీ- రన్నరప్ హరితేజ
కౌషల్- గీతా మాధురి
రాహుల్ సిప్లిగంజ్- శ్రీముఖి.
ఈ సారి మాత్రం విజేతతో పాటు రన్నరప్ కూడా మగవాళ్లదే. మరి వచ్చే ఐదవ సీజన్లో అయినా ఆడవాళ్ళు విజేతగా నిలుస్తారా లేదా చూడాలి.