బ్రేకింగ్; చైనాలో మళ్ళీ కొత్త వైరస్…!

-

ఒక పక్క ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో చుక్కలు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపు అన్ని దేశాలు కూడా ఈ వైరస్ దెబ్బకు నరక యాతన అనుభవిస్తున్నారు. ఇటలీ, ఇరాన్, స్పెయిన్, అమెరికా సహా అనేక దేశాల్లో ఈ వైరస్ తన ప్రభావం చూపిస్తుంది. దక్షిణ అమెరికా దేశాలు ఎక్కువగా దీని కారణంగా ఇబ్బందులు పడుతున్నాయి.

ఇది పక్కన పెడితే ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు తగ్గకుండానే ప్రపంచానికి మరో వైరస్ పరిచయం అయింది. ఎప్పుడో 1959 లో పుట్టిన హంటా అనే వైరస్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చింది. చైనాలోని శాంగ్దాండ్ ప్రావిన్స్ లో 39 ఏళ్ళ ఒక వ్యక్తి హంటా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది కొందరి మాట.

2016 లోనే దీనికి వ్యాక్సిన్ కూడా కనిపెట్టారని సమాచారం. 2016 నుంచి దీనికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ వైరస్ పుట్టిన తొలి నాళ్లలో ఎక్కువగా జనాలు ప్రాణాలు కోల్పోయారని ఇప్పుడు దాని ప్రభావ౦ అంతగా ఉండకపోవచ్చు అంటున్నారు. దీనిని వెంటనే గుర్తించిన చైనా ప్రభుత్వం పక్కా చర్యలు చేపట్టింది. ఇది ఎలా సోకుతుంది అనేది మాత్రం స్పష్టత రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news