సెంటిమెంట్ రిపీట్..MEGA 154లో ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రవితేజ!

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలకు కాంపిటీషన్ ఇవ్వడమే కాదు దూసుకుపోతున్నారు కూడా అని చెప్పొచ్చు. వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న ఆయన..తన కెరీర్ స్టార్టింగ్ డేస్ లో ఎంత స్పీడ్ గా సినిమాలు చేశారో ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు.

‘ఆచార్య’ చిత్రం ఈ నెల 29న విడుదల కానున్న నేపథ్యంలో త్వరలో చిరంజీవి ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ఫిల్మ్స్ షూటింగ్స్ వరుసగా కంప్లీట్ చేసుకుంటున్నారు. చిరంజీవి – యంగ్ డైరెక్టర్ బాబీ (కె.ఎస్.రవీంద్ర) కాంబోలో వస్తున్న MEGA 154 షూట్ ఇటీవల ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో మేకర్స్ షేర్ చేశారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ పిక్చర్ లో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. బాబీ దర్శకత్వంలో రవితేజ గతంలో సినిమా చేశాడు. ఈ నేపథ్యంలో స్టోరిలో ఉన్న ఇంపార్టెన్స్ రిత్యా ఆ పాత్రకు రవితేజనే కరెక్ట్ అని అనుకున్నారట. ఇకపోతే గతంలో చిరంజీవి-రవితేజ కలిసి ‘అన్నయ్య’ చిత్రంలో నటించారు. అందులో అన్నతమ్ముళ్లుగా నటించారు.

ఇక ఇఫ్పుడు కూడా MEGA 154లోనూ అన్నతమ్ములుగానే నటిస్తారని టాక్. అయితే, ఈ విషయమై మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రుతిహాసన్ నటిస్తోంది. రవితేజ సరసన నివేతా పేతురాజ్ నటించబోతుందని వినికిడి.ఇక ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ ఫిక్స్ అయిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ లీక్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news