విజయవాడ.. ఏపీ రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న నగరం. ఇప్పుడు విజయవాడ వాసులు ఓ ప్రమాదకరమైన ఇబ్బందుల్లో చిక్కుకోబోతున్నారా.. అసలు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుంతో తెలియదా.. అసలు ఈ ప్రమాదం ఏ రూపంలో వస్తుంది.. ప్రమాదం అంటే ఒకరికా.. ఇద్దరికా.. లేక మావన తప్పిదమా.. లేక ఏదైనా గ్రహంతరం నుంచి వస్తున్న ముప్పా.. అసలు కేవలం విజయవాడ కే పరిమితమా.. ప్రమాదం మరేదైన ప్రాంతానికి కూడా వస్తుందా.. విజయవాడ ప్రజలకు ఎప్పుడైనా ఏ రూపంలోనైనా ఈ ఉపద్రవం ముంచుకు రావొచ్చట.
అది అర్థరాత్రా.. అపరాత్రా.. పగలా అనే తేడా లేకుండా ఎప్పుడైనా అది రావొచ్చనే వార్త ఇప్పుడు విజయవాడ చుట్టు పక్క ప్రాంతాల ప్రజలకు నిద్రలేకుండా చేస్తుంది.. ఇంతకు ఏ ముప్పు వస్తుంది.. అంటే దానికి పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల ప్రకారం.. ఏపీ ఆర్థిక రాజధాని విజయవాడకు భూకంపాల ముప్పు ఉందట. అది మామూలు స్థాయిలో కాదట. అది తీవ్రమైన భూకంపాలకు ఆవాస కేంద్రంగా ఉందట.. ఇది ఎవ్వరో చెప్పిన మాటలు కాదు.. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ), కేంద్ర ప్రభుత్వం కలిసి, భూకంప ప్రభావిత ప్రాంతాల సూచిక రిపోర్టును రెడీ చేశాయి.
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లోని ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ (ఈఆర్సీసీ) చీఫ్ ప్రొఫెసర్ ప్రదీప్, విద్యార్థులతో కలిసి ఈ రిపోర్టును సిద్ధం చేశారు. ఆ రిపోర్ట్‌ని ఐఐటీ ప్రొఫెసర్లు, కేంద్రంకు పంపించగా, కేంద్ర శాస్త్రవేత్తల బృందం కూడా ఈ అధ్యయనంను ధృవీకరించాయి. ఈ సంస్థలు సంయుక్తంగా దేశవ్యాప్తంగా చేసిన అధ్యయనంలో తెలిసిన సత్యం. ఈ అధ్యయనం ప్రకారం దేశ వ్యాప్తంగా సుమారు 50నగరాలకు ఈ భూకంప ప్రమాదాలు పొంచి ఉన్నాయట.
ఈ అధ్యయనంలో ఈ క్రింది అంశాలను తీసుకున్నారట. సముద్రతీర ప్రాంతాల్లో ఎంతమంది ప్రజలు ఉంటున్నారు.. ఇళ్ల నిర్మాణం ఎలా ఉంది, ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి.. సముద్రానికి ఎంత దూరంలో ఉన్నాయి.. గతంలో ఎప్పుడైనా అక్కడ భూకంపాలు వచ్చాయా వంటి అంశాలను లెక్కలోకి తీసుకుని పరిశోధన చేశారట. ఈ అధ్యయనంను దాదాపుగా మూడేళ్ల పాటు దేశవ్యాప్తంగా కొనసాగించాయట.
ఇందులో 50నగరాల్లో 13 నగరాలకు తీవ్రమైన భూకంప ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. అందులో ఢిల్లీ, కోల్‌కతా, పుణె, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, సిలిగురి, డార్జిలింగ్, ఛండీగఢ్ లతో పాటుగా విజయవాడ కూడా ఉంది అని తేలింది. ఈ ప్రాంతాల్లో భూకంపం 4 నుంచి 6 తీవ్రతతో భూకంపాలు రావొచ్చని అందులో తెలిపారు. ఇప్పుడు ఈ రిపోర్టు ప్రకారం విజయవాడ ప్రజల్లో వణుకు పట్టుకుంది.