రాజస్థాన్ లో దారుణం జరిగింది. ఒక మహిళ తన అత్తగారిని పాము కాటుతో చంపిన వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని జున్ జున్ జిల్లాలోని ఒక గ్రామంలో జరిగింది. సుబోధ్ దేవి కోడలు అల్పానాకు జైపూర్ నివాసి మనీష్‌తో ఏర్పడిన వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసింది. అల్లుడు ఉంది. హత్య కేసులో అల్పానా, మనీష్, అతని స్నేహితుడు కృష్ణ కుమార్ ఇటీవల అరెస్టయ్యారు.
అల్పానా మరియు ఆమె అత్తగారు అయిన సుబోధ్ దేవి గ్రామంలో కలిసి నివసించేవారు. అల్పానా భర్త, సచిన్ మరియు అతని సోదరుడు చిరాంతన్ భారత ఆర్మీలో పని చేస్తున్నారు. దీనితో వారు కుటుంబానికి దూరంగా ఉన్నారు. సుబోధ్ దేవి భర్త రాజేష్ కూడా ఉద్యోగ రిత్యా కుటుంబానికి దూరంగా ఉన్నారు. సచిన్ మరియు అల్పానా వివాహం డిసెంబర్ 12, 2018 లో జరిగింది.
భర్త దూరంగా ఉండటంతో అల్పానాకు మనీష్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వారు పదే పదే ఫోన్లు మాట్లాడుకోవడం గమనించిన సుబోధ్ దేవి ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్తగారు తన ప్రేమకథకు అడ్డంకిగా మారడ౦తో, అల్పానా మరియు ఆమె ప్రేమికుడు మనీష్ సుబోధ్ దేవిని ఎవరూ ఊహించని విధంగా చంపడానికి ప్రణాళిక సిద్దం చేసారు. జూన్ 2, 2019 న వారు సుబోధ్ దేవిని పాము కాటుతో చంపారు.
అయితే, ఆమె మరణించిన ఒకటిన్నర నెలల తరువాత, అల్పానా అత్తగారి తరుపు బంధువులు ఆమెపై అనుమానాలు రావడంతో, పోలీసు ఫిర్యాదు చేశారు. వారు బలమైన సాక్ష్యాలను కూడా అందించారు. వారు అల్పానా, మనీష్ టెలిఫోన్ నంబర్లను పోలీసులకు ఇచ్చారు. జూన్ 2 న, రెండు నంబర్ల మధ్య 124 కాల్స్ వచ్చాయి మరియు అల్పానా మరియు కృష్ణ కుమార్ మధ్య 19 కాల్స్ వచ్చాయి.
వీరు కొన్ని మెసేజులు కూడా చేసుకున్నట్టు పోలీసు విచారణలో తేలింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సుపోధ్ దేవి హత్యకు అల్పానా, మనీష్ మరియు అతని స్నేహితుడు కృష్ణ కుమార్ దోషులుగా తేలడంతో వారిని జనవరి 4, 2020 న అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ ఘటన రాజస్థాన్ లో సంచలనంగా మారింది. వారిని ప్రస్తుతం కోర్ట్ ఆదేశాల మేరకు కస్టడీకి తరలించారు పోలీసులు.