కుర్రాళ్లతో నిండిన న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు మూడు వన్ డే లను ఆడేందుకు వచ్చింది. ఈ సిరీస్ కు న్యూజిలాండ్ ఫెర్గుస్సన్ ను మరో కొత్త కెప్టెన్ గా నియమించింది. కాగా మొదటి వన్ డే వర్షం కారణంగా రద్దు కాగా.. రెండవ వన్ డే లో న్యూజిలాండ్ విజయం సాధించింది.. ఇక ఆఖరిది అయిన మూడవ వన్ డే లో టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక బంగ్లాదేశ్ కు కూడా శాంటో రూపంలో కొత్త కెప్టెన్ ను నియమించినా బ్యాటింగ్ లో పర్వాలేదనిపించినా జట్టుగా ఫెయిల్ అవ్వడంతో కివీస్ ముందు కేవలం 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఈ టార్గెట్ ను న్యూజిలాండ్ మరో 15 ఓవర్లు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చెందించి సిరీస్ ను 2 – 0 తేడాతో గెలుచుకుంది. కివీస్ ఆటగాళ్లలో యంగ్ (70) మరియు హెన్రీ నికోలస్ (50) లు రాణించారు.
ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్ ను నిలువరించడంలో బంగ్లాదేశ్ విఫలం అయింది. ఈ సిరీస్ కు షకిబుల్ హాసన్ లేకపోవడం కూడా ప్రతికూలం అని చెప్పాలి.