ఢిల్లీ మర్కజ్ మసీదు ఘటన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల విషయంలో జాతీయ మరియు రాష్ట్ర నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎప్పుడైతే మర్కజ్ ఘటన బయటపడిందో ఊహించని విధంగా దేశంలో మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. వైరస్ గురించి వార్తలు వచ్చిన స్టార్టింగ్ లో కరోనా వైరస్ ఎక్కువగా విదేశాల నుండి స్వదేశానికి వచ్చిన వారి ద్వారా వ్యాప్తి చెందుతుంది అని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే విమానాల రాకపోకలను ఆపేసింది. ప్రతి విమానాశ్రయంలో కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహించి, ప్రయాణికుడి యొక్క ఆరోగ్య పరిస్థితి నిర్ధారణకు వచ్చి అప్పుడు పాసింజర్ లను కేంద్రం వదిలింది.అయినా గాని ఉన్న కొద్దీ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే 21 రోజుల పాటు లాక్ డౌన్ దేశవ్యాప్తంగా విధించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి లో ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అవి కూడా విదేశాల నుండి వచ్చిన వాడి వల్ల కేసులు నమోదయ్యాయి. అయితే ఏపీలో విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించడంలో ముందు నుండి పకడ్బందీగా గ్రామ వాలంటీర్ల తో పని చేయించిన సర్కార్, ప్రారంభంలో సక్సెస్ సాధించింది. అయితే ఎప్పుడైతే ఢిల్లీ మర్కజ్ మసీద్ ప్రార్థన సమావేశాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి భారీగా వెళ్లడంతో, ఆ మత ప్రార్థనలకు వెళ్లిన వారికి కరోనా పాజిటివ్ రావటం మొదలు పెట్టిందో రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్ లో మరియు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు బయట పడుతున్నాయి. నమోదవుతున్న అన్ని కేసులు కూడా మర్కజ్ ఘటనతో లింకు ఉన్నవే. దీంతో ఈ మత ప్రార్థనలకు వెళ్లిన వారు… తిరిగి వచ్చాక ఎంతమందిని కలిశారో వంటి విషయాల్లో గుర్తించడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తే అనగా మూడో దశకు చేరుకుంటే మరో ఇటలీ, స్పెయిన్ దేశాలు అవుతాయని చాలామంది అంటున్నారు. ముఖ్యంగా వైద్య పరికరాలు, వైద్య సిబ్బంది లేక ఇప్పటికే నానా అవస్థలు పడుతున్నారని…మూడో దశకు చేరుకుంటే భయంకరంగా కరోనా మహామారి విజృంభిస్తుంది అని అది కంట్రోల్ చేయటం అభివృద్ధి చెందిన దేశాలకు అవలేదని, ఆ పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాలలో వస్తే చాలామంది చనిపోయే అవకాశం ఉందని, అందువల్లే అటువంటి పరిస్థితి రాకూడదని ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ ఇంకా కొనసాగించాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కెసిఆర్ ప్రధాని మోడీ ని విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం.