ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్ : పోలవరం ప్రాజెక్టుకు భారీ జరిమానా

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ జి టి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు భారీ జరిమానా విధించింది ఎన్జీటి. పర్యావరణ అనుమతుల ఉల్లఘిస్తూ పోలవరం నిర్మాణాన్ని చేపడుతున్నందుకు రూ.120 కోట్లు జరిమానా విధించింది ఎన్జీటి. పురుషోత్త పట్నం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పనులు చేపట్టినందుకూ భారీ జరిమానా విధించింది.

పురుషోత్తంపట్నంకు రూ.24.56 కోట్లు, పట్టసీమ కు రూ. 24.90 కోట్లు, చింతల పూడికి రూ.73.6 కోట్లు జరిమానా విధించింది ఎన్జీటి. పర్యావరణ ఉల్లంఘనలపై ఎన్జీటికి సామాజిక వేత్త పెంటపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే వట్టి వసంత కుమార్ లు పిర్యాదు చేశారు. జరిమానాను 3 నెలల్లోగా చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటి ఆదేశాలు జారీ చేసింది. ఏపి కాలుష్య నియంత్రణ మండలి కి జరిమానా చెల్లించాలన్న ఎన్జీటి…జరిమానా నిధుల వినియోగంపై ఏపీపిసిబి, సిపిసిబి సభ్యులతో కమిటీని నియమించాలని పేర్కొంది.  తమ ఆదేశాలను పాటించకపోతే.. కఠిన చర్యలు తప్పవని తెలిపింది ఎన్జీటి.

Read more RELATED
Recommended to you

Latest news