ఏపీలో జనవరి 31 వరకు నైట్ కర్ప్యూ అమలు కానుంది. ఈ మేరకు నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్నటి సమీక్షలో నైట్ కర్ఫ్యూ విధించాలని సీఎం జగన్ సూచనలు చేశారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు కానుందది. ఈ నెలాఖరు వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు జీవోలో తాజాగా పేర్కొంది జగన్ ప్రభుత్వం. గతంలో మాదిరిగానే కొన్ని వ్యవస్థల్లో పని చేసే వారికి వెసులుబాట్లు కల్పించింది.
అలాగే.. మాస్క్ పెట్టుకోకుంటే రూ. 100 జరిమానా విధించాలని… పబ్లిక్ గేదరింగ్స్‌కు పరిమిత సంఖ్యతో కూడిన అనుమతికి నిర్ణయం తీసుకుంది సర్కార్. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది.. ఇండోర్ గేదరింగ్స్‌కు 100 మందికి మాత్రమే పర్మిషన్ ఉన్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. సినిమా థియేటర్లల్లో ఓ సీటును వదిలి పెట్టి.. భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిబంధనలు పాటించని సంస్థలకు రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. ప్రార్థనా మందిరాల్లోనూ భౌతిక దూరం పాటిస్తూ.. కరోనా నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది సర్కార్.