ఇక ఆ రాష్ట్రంలో కూాడా ఆంక్షలు… ఓమిక్రాన్ నేపథ్యంలో నిర్ణయం.

ఓమిక్రాన్ దేశంలో విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో 300కు పైగా కేసులు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తుండటంతో మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం, రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. ఓమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్రాలు పలు ఆంక్షల ఛట్రంలోకి వెళుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్  రాష్ట్రాలు నైట్ కర్ప్యూలు విధించాయి. న్యూ ఇయర్ సెలబ్రెషన్లపై ఆంక్షలు విధించాయి. తాజాగా ఈ జాబితాలో మధ్య ప్రదేశ్ కూడా చేరింది.

మధ్య ప్రదేశ్ లో నేటి నుంచి ఆంక్షలు విధించనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్రం మొత్తం కర్ప్యూ విధించనున్నారు.  సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ అధికారికంగా ప్రకటించారు. ఎమర్జెన్సీ సేవలకు అనుమతి ఉంటుందని సీఎం పేర్కొన్నారు.  దీంతో రాత్రి వేళల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం కానున్నారు. పండగల వేళ కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలు, యూటీలకు సూచనలు జారీ చేసింది. దీంట్లో భాగంగానే పలు రాష్ట్రాలు ఆంక్షల్ని అమలు చేస్తున్నాయి.