థర్డ్ వేవ్ ను అడ్డుకునేందుకు సిద్ధమవుతున్న ఢిల్లీ సర్కార్…

-

ఓవైపు ఓమిక్రాన్ వేరియంట్, మరోవైపు కరోనా కేసులు దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 300ను దాటింది. ముఖ్యంగా ఢిల్లీలో పెద్ద స్థాయిలో ఓమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ముఖ్యంగా థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్న తరుణంలో… థర్డ్ వేవ్ నుఅడ్డుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది.

ప్రతి రోజు లక్ష “కోవిడ్” కేసులకు చికిత్స అందించడంతా పాటు, ప్రతిరోజు 3 లక్షల పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని కూడా సిద్ధంగా చేసుకుంది ఢిల్లీ ప్రభుత్వం. చాలా వేగంగా వ్యాప్తి చెందే ఓమిక్రాన్ ను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటుండి. రానున్న నెలలకు అవసరమైన మెడిసిన్స్ నిల్వలు సిద్దం చేసుకుంటోంది ఢిల్లీ సర్కార్. అయితే కొద్ది పాటి లక్షణాలు ఉన్న కరోనా పేటెంట్లు ఆసుపత్రులకు పరిగెత్తకుండా ఇళ్లలోనే ఉండటం శ్రేయస్కరం అని ఢిల్లీ ప్రభుత్వం సూచిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలను ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలుపై ఆంక్షలు విధించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news