నిఖిల్ 18 పేజెస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

-

నిఖిల్ సిద్దార్థ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా గత ఏడాది నటించిన చిత్రం కార్తికేయ 2.. ఈ సినిమా భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ జంటకు మరింత గుర్తింపు లభించింది. ఆ తర్వాత మళ్లీ ఈ జంట 18 పేజీస్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇండస్ట్రీలో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది. మొత్తానికైతే వీరిద్దరి కాంబినేషన్లో మళ్లీ మళ్లీ సినిమాలు రావాలి అని అభిమానుల సైతం కోరుకుంటున్నారు. సాధారణంగా థియేటర్లలో విడుదలైన ఏ సినిమా అయినా సరే మంచి సక్సెస్ పొందింది అంటే ఆరు వారాల తర్వాత ఓటీటీ లోకి వస్తుంది. ఈ క్రమంలోనే నిఖిల్ 18 పేజీస్ సినిమా కూడా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు ప్రముఖ ఓటీటీ నిర్వహకులు.

గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన చిత్రం 18 పేజెస్ గత ఏడాది డిసెంబర్ 23 న విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ బెల్టులో కూడా మంచి ఆదరణ పొందింది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించడానికి మరోసారి సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటి సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే విషయానికి వస్తే ఈ నెల రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 27 నుంచి నెట్ ఫ్లెక్స్ లో డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది . ఆహా వీడియోలో కూడా అదే డేట్ నుండి ప్రసారం కానుంది.

ఈ సినిమా కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ అందించారు. మొత్తానికైతే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news