చాలెంజ్ యాక్సెప్ట్ చేసిన నిఖిల్..!

ప్రస్తుతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొంటూ విరివిగా మొక్కలు నాటుతున్న విషయం తెలిసిందే. టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశవ్యాప్తంగా విస్తరిస్తూనే ఉంది. ముఖ్యంగా ఎంతో మంది సినీ ప్రముఖులు ఛాలెంజ్ లో పాల్గొంటూ మొక్కలు నాటడమే కాదు మరో ముగ్గురిని మొక్కలు నాటాలని పిలుపునిస్తు చాలెంజ్ విసురుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. ఇక తాజాగా యువ హీరో నిఖిల్ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటారు.

దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నిఖిల్. నటుడు రాజారవీంద్ర విసిరిన ఛాలెంజింగ్ యాక్సెప్ట్ చేసిన తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా అనుపమ పరమేశ్వరన్, అవికా గోర్, కలర్స్ స్వాతి లకు ఛాలెంజ్ విసిరాడు నిఖిల్. కాగా ప్రస్తుతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నిఖిల్ మొక్కలు నాటిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణాన్ని రక్షించడానికి ఎంతగానో తోడ్పడుతుందనినిఖిల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.