ద‌ళిత బంధు స్కీమ్ అద్భుతం : జాగ్వార్ హీరో

-

ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అద్భుతమని జేడీ(ఎస్) నేత, కన్నడ హీరో నిఖిల్ గౌడ కొనియాడారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన నిఖిల్ గౌడ.. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ విజ‌న్ బాగుంద‌ని నిఖిల్ గౌడ అన్నారు. త‌న విజ‌న్‌తో తెలంగాణ‌ను అభివృద్ధి ప‌థంలో కేసీఆర్ న‌డిపార‌ని, అలాంటి విజ‌న్‌ను ఇప్పుడు దేశ‌వ్యాప్తం చేస్తుండటం శుభపరిణామమని తెలిపారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ అభివృద్ధిని చూస్తోంటే కేసీఆర్ పాలన ఎలా ఉంటుందో తెలుస్తోందని చెప్పారు. ద‌ళిత బంధు ప‌థ‌కం అమేజింగ్‌గా ఉంద‌ని నిఖిల్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ద‌ళితుల్ని ప‌ట్టించుకోలేద‌ని ఆరోపించారు. రైతుల కోసం కేసీఆర్ అందిస్తున్న రైతు బంధు ప‌థ‌కం కూడా అద్భుతంగా ఉంద‌ని నిఖిల్ కితాబిచ్చారు.

అంతకుముందు తన తండ్రి కుమారస్వామి, ఇతర నేతలకు కేసీఆర్ ప్రగతి భవన్ లో ఇచ్చిన అల్పాహార విందులో నిఖిల్ గౌడ పాల్గొన్నారు. అతిథులకు మంత్రి కేటీఆర్ స్వయంగా అల్పాహారం వడ్డించారు. ముఖ్యంగా కేటీఆర్ ఈ జాగ్వార్ హీరోకు స్వయంగా ఇడ్లీ వడ్డించారు.

Read more RELATED
Recommended to you

Latest news