ఏపీలో మార్చ్ నెలలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఎన్నికల కమిషనర్ వాయిదా వేయడంతో ఆయనకు ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగి, ఆయన్ని ఆ పదవి దించేలా ప్రభుత్వం పని చేసింది. ఆయన కూడా ఎక్కడ తగ్గకుండా సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ తన పాత పదవి తాను తెచ్చుకున్నాడు. అయితే అప్పుడు వాయిదా పడిన ఎన్నికలు ఈ నెల 21న జరగనున్నాయని ప్రచారం సోషల్ మీడియాలో మొదలయింది.
అయితే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ విడుదల చేసినట్టు సోషల్ మీడియాలో వస్తున్న షెడ్యూల్ పూర్తి అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. ఇదేదో తప్పుడు ప్రచారాన్ని, ప్రోత్సహించే విధంగా ఉందనే అనుమానాలు రేకెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం తప్పుడు సమాచారం మాత్రమేనన్న ఆయన ఇందులో వాస్తవికత లేదని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.