ఇలా కూడా కరోనా వైరస్ సోకుతుంది… తస్మాత్ జాగ్రత్త?

-

భారత్ లో కరోనా మహమ్మరి అడ్డూఅదుపు లేకుండా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో అంచనాలను మించి కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరికి వైరస్ సోకుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఒక అపార్టుమెంటులో ఒక్కరికి కరోనా సోకినా ఇతరులు కూడా వైరస్ బారిన పడే అవకాశం ఉందని తాజా పరిశోధనల్లో వెల్లడవుతోంది.

అసలు ఇలా కూడా కరోనా సోకుతుందా…? అని ఆశ్చర్యపోయేలా వైరస్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా చైనాలోని ఒక అపార్టుమెంటులో కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఊహించని విధంగా సోకింది. చైనాలోని గాంజ్వైలోని ఒక అపార్టుమెంట్ లో 15వ అంతస్తులో ఒక కుటుంబంలో ఐదుగురు నివశిస్తుండగా వారిలో నలుగురికి కరోనా నిర్ధారణ అయింది. వాళ్ల వల్ల మరో అంతస్తులో నివశిస్తున్న దంపతులకు వైరస్ నిర్ధారణ అయింది.

ఈ రెండు కుటుంబాలకు ఒకరికొకరికి ముఖ పరిచయం లేదు. ఒకరి కుటుంబం నుంచి మరొకరి కుటుంబానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధాలు లేవు. 15వ అంతస్తు నుంచి కమోడ్ గ్యాస్ పైప్ లైన్ ద్వారా వైరస్ మరో అంతస్తులోకి వెళ్లిందని తెలిసి షాక్ అవ్వడం వైద్య నిపుణుల వంతయింది. బాత్ రూమ్ వెంటిలేటర్లను తెరవకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి జరిగిందని వైద్య నిపుణులు నిర్ధారణకు వచ్చారు. 15వ అంతస్తులోని వ్యక్తులు వుహాన్ నుంచి కొంతకాలం క్రితమే వచ్చారని వుహాన్ లోనే వారు వైరస్ బారిన పడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news