మరికొద్ది సేపట్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ వాచ్ యాప్ ని లాంచ్ చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ కు అనువుగా ఉండేలాగా ఈ యాప్ రూపొందించబడింది. ఇప్పటికే ఎన్నికల పర్యవేక్షణ, ఫిర్యాదుల సేకరణ కోసం ఒక ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.
ఇప్పుడు కాల్ సెంటర్ తో ఈ వాచ్ యాప్ ని కూడా అనుసంధానం చేయనున్నారు. అయితే ముందు నుంచి కూడా ఈ వాచ్ యాప్ మీద వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యాప్ కాకుండా సొంతగా ఎందుకు యాప్ సిద్ధం చేశారు అని వైసిపి ప్రశ్నిస్తోంది. అంతేకాక ఈ అంశం మీద వైసిపి కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వాచ్ యాప్ వినియోగించ వద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.