నిమ్మగడ్డ సంచలనం…త్వరలో మునిసిపల్ ఎన్నికల నోటఫికేషన్ ?

Join Our Community
follow manalokam on social media

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది..ఒకటి రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చి 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. తన పదవీకాలం పూర్తయ్యేలోపు ఈ ఎన్నికలు ముగించేలా ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 

అయితే ఇప్పటికే ఆయన పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు, ఈ ఎన్నికలు ఫిబ్రవరి 21వ తేదీతో ముగియనున్నాయి. ఇప్పటికే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలు కూడా జరిపేందుకు ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మున్సిపల్ ఎన్నికలు కూడా ఆయన నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకి ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తుంది అనేది మాత్రం ఇప్పుడు ఆశ్చర్యకరం గా మారింది. చూడాలి మరి ఏమవుతుందో..

TOP STORIES

ఇక నుండి 24×7 కరోనా వాక్సిన్…!

ఇప్పుడు వ్యాక్సిన్ కనుక వేయించుకోవాలి అంటే సరిగ్గా ఇదే సమయానికి వేయించుకోవాలని ఏమీ లేదు. హాస్పిటల్ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లు సమయాన్నిబట్టి షెడ్యూల్ ని...