బిజెపి ఒక వాషింగ్ మెషిన్… సీఎం సంచలన వ్యాఖ్యలు

-

పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక జాతీయ మీడియా కార్యక్రమంలో మాట్లాడిన ఆమె…’బాటిల్ ఫర్ బెంగాల్: ది లాస్ట్ లేడీ స్టాండింగ్’ పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ నల్ల డబ్బును తెల్లగా మార్చే వాషింగ్ మెషీన్ అని ఆరోపించారు. తనపై అవినీతి ఆరోపణలు బిజెపి నేతలు చేస్తున్న నేపధ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు.

తమ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా తోలాబాజీ (హఫ్తా) సంస్కృతిని ప్రోత్సహిస్తోందన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపణలపై ఆమె స్పందించారు. “తృణమూల్ తోలాబాజీ పన్ను రాష్ట్రంలో ప్రబలంగా ఉంది. పశ్చిమ బెంగాల్ లోని ప్రతి బిడ్డకు ఈ టిటిటి గురించి తెలుసు. మీరు విద్య కోసం పన్ను చెల్లించాల్సిన ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. సిండికేట్ మరియు టిటిటి సంస్కృతిని ఎవరూ వ్యతిరేకించలేదు, అందుకే తృణమూల్ కాంగ్రెస్‌ ఇష్టం వచ్చినట్టు చేస్తుంది అని ఫిబ్రవరి 2 న బెంగాల్ దుర్గాపూర్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ చెప్పారు.

దీనిపై మమత మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇలాంటి ఆరోపణలు వస్తుంటాయి. బిజెపి నేతలు కూడా మా పార్టీలో జాయిన్ అయ్యారు అని ఆమె ఆరోపించారు. మా పార్టీని వదిలేసిన నేతలు మంచి పని చేసారని మేము ఇప్పుడు పవిత్రంగా ఉన్నామని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్ బిజెపి అంతర్గత సమస్యలతో చిక్కుకుందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు వారు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు అని ఆమె అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news