ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ కి ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్ట్ కి వెళ్ళారు. ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ఆదేశాలతో బాధ్యతలు చేపట్టారు. అయితే ఎన్నికల సంఘం విధుల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని, ఎన్నికల సిబ్బందిని కేసులు పెట్టి వేధిస్తున్నారు అని ఆయన హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. ఎన్నికల కమీషన్ నుంచి సిఐడి తీసుకుని వెళ్ళిన వస్తువులు తిరిగి ఇవ్వాలని ఆయన పిటీషన్ దాఖలు చేసారు.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తీరుపై నిమ్మగడ్డ ఆగ్రహంగా ఉన్నారు. తనను తప్పించడంపై ఆయన హైకోర్ట్ లో సుధీర్గ పోరాటం చేసి విజయం సాధించారు. బిజెపితో సంబంధాలు ఉన్నాయి అని ఆరోపణలు అధికార పార్టీ నేతలు నిమ్మగడ్డను టార్గెట్ చేసినా సరే ఆయన తిరిగి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా కోర్ట్ ఆదేశాలతో బాధ్యతలు స్వీకరించారు.