నీరవ్ మోడీకి లండన్ లో షాక్… బెయిల్ అంగీకరించని కోర్ట్…!

-

వజ్రాల వ్యాపారి నీరవ్ మోడికి లండన్ లో షాక్ ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)ని రూ.13,500 కోట్ల మేర మోసగించి లండన్‌లో తలదాచుకుంటున్న ఆయనకు కోర్ట్ బెయిల్ పిటీషన్ కొట్టేసింది. వివరాల్లోకి వెళితే గత ఏడాది జనవరిలో కుంభకోణం వెలుగులోకి వస్తుందని తెలిసిన వెంటనే తన మేనమామ మొహుల్ చోక్సీతో కలిసి దేశం విడిచి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆయన లండన్ లో తల దాచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి భారత దర్యాప్తు సంస్థలు ఆయన కోసం ప్రయత్నాలు చేసినా సరే ఫలితం లేకుండా పోయింది.

ఇదే సమయంలో పిఎన్బికి ఈయన వ్యవహారం తీవ్ర తలనొప్పిగా మారింది. ఈ ఏడాది మార్చి 19న యూకేలోని స్కాట్‌లాండ్ యార్డ్‌లో ఆయన్ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైల్లో ఉన్న 48 ఏళ్ళ నీరవ్ మోడీ… తాను మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నానంటూ కోర్ట్ లో బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా అందుకు కోర్ట్ నిరాకరించింది. ఆయనకు కోర్ట్ బెయిల్ పిటీషన్ విషయంలో ఇలా షాక్ ఇవ్వడం ఇది నాలుగో సారి… తన పూచీకత్తు మొత్తాన్ని నాలుగు మిలియన్ల పౌండ్ల మేర రెండింతలు పెంచినా.

హౌస్ అరెస్టుకు సైతం ఒప్పుకున్నా సరే నీరవ్ కి బెయిల్ ఇచ్చేందుకు కోర్ట్ అంగీకరించలేదు. అయితే ఇక్కడ నీరవ్ కోర్ట్ కి ఒక షాక్ ఇచ్చారు. తనను గనుక భారత్ తిప్పి పంపిస్తే మాత్రం ఆత్మహత్య చేసుకుంటాను అని కోర్ట్ కి చెప్పడం విశేషం. తదుపరి విచారణ వచ్చే నెల 4న జరగనుంది. ఇదిలా ఉంటే ఈయనను ఈ ఏడాది మార్చ్ లో లండన్ లో అరెస్ట్ చేయడం కేవలం ఎన్నికల స్టంటే అని కాంగ్రెస్ పార్టీ బిజెపిపై తీవ్ర విమర్శలు చేసింది. మరి ఆయన గురించి ఎన్నికల తర్వాత ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించింది.

Read more RELATED
Recommended to you

Latest news