త్వరలో భారత్‌కు నీరవ్‌మోడీ.. బ్రిటన్‌ కోర్టులో భారత్‌ విజయం !

-

బ్రిటన్‌ కోర్టులో భారత్‌ విజయం సాధించింది. నీరవ్‌ మోడీని భారత్‌కు అప్పగించేందుకు యూకే కోర్టు అనుమతి ఇచ్చింది. నీరవ్‌ వాదనలను కొట్టిపారేసిన బ్రిటన్‌ కోర్టు, బ్యాంకుల దగ్గర వేలకోట్లు తీసుకున్నట్లు ఆధారాలున్నాయని యూకే కోర్టు తేల్చి చెప్పింది. రూ.14 వేల కోట్ల పీఎన్‌బీ స్కామ్‌లో నీరవ్‌పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.

భారత్‌లో తనకు న్యాయం జరగదన్న నీరవ్‌ వాదనలు తోసిపుచ్చిన యూకే కోర్టు నీరవ్‌పై మనీలాండరింగ్‌ అభియోగాలు రుజువయ్యాయని అభిప్రాయ పడింది. నిజానికి 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే నీరవ్ మోడీ ఇండియా విడిచి లండన్‌ వెళ్లారు…నీరవ్ మోదీని తమకు అప్పగించాలని గతంలో భారత్‌ బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసింది. నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేశాడాన్న విషయంలో తగిన ఆధారాలతో ఈడీ, సీబీఐ అధికారుల బృందం ఎప్పుడో లండన్‌ కోర్టుకు అప్పగించింది.. 

Read more RELATED
Recommended to you

Latest news