హైడ్రోజన్ పెరాక్సైడ్ వలన ఇంట్లో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసుకోండి.

-

హైడ్రోజన్ పెరాక్సైడ్ ని నోటిని కడుక్కునే సాధనాల్లో ఎక్కువగా వాడతారు. దంతాలు తెల్లగా మారడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్రాధాన్యం చాలా ఉంటుంది. ఐతే మరీ గాఢంగా ఉన్న హైడ్రోజన్ పెరాక్సైడ్ ని కాకుండా పెద్దగా హాని చేయని వాడితే మంచిది. కొంత మంది వైద్యులు చెప్పిన దాని ప్రకారం హైడ్రోజన్ పెరాక్సైడ్ ని నీటితో కలుపుకుని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మితే దంతాలు తెల్లగా మారే అవకాశం ఉందని చెబుతారు. కానీ వైద్యుడిని సంప్రదించకుండా ఇలాంటి చేయకపొవడమే బెటర్.

దంతాల సమస్యలకి హైడ్రోజన్ పెరాక్సైడ్ చాలా ఉపయోగపడుతుంది. ప్రతీ మూడు నెలలకి ఒకసారి టూత్ బ్రష్ ని పారేయాలని చెబుతుంటారు. ఐతే ప్రతీ సారీ అది కుదరకపోవచ్చు. అలాంటప్పుడు ఆ బ్రష్ ని హైడ్రోజన్ పెరాక్సైడ్ లో నానబెడితే సూక్ష్మ క్రిములన్ని చనిపోతాయి. ఆ తర్వాత మీరు దాన్ని వాడవచ్చు.

పండ్లు, కూరగాయలని శుభ్రం చేయాలనుకున్నప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ ని కొద్దిగా చిలకరిస్తే సూక్ష్మక్రిములు త్వరగా చనిపోతాయి. కాకపోతే మరీ గాఢంగా ఉన్న హైడ్రోజన్ ని వాడవద్దు.

బోళ్ళు తోమే బ్రష్ లని శుభ్రం చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ బాగా ఉపయోగపడుతుంది. బ్రష్ అంతా చెత్తపట్టి అదోలా కనిపిస్తే దానిపై హైడ్రోజన్ పెరాక్సైడ్ చల్లి కడిగితే చాలు.

రక్తపు మరకలని పోగొట్టడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ సాయపడుతుంది. రక్తం అంటిన షర్టు, టీ షర్టులపై హైడ్రోజన్ పెరాక్సైడ్ చల్లి ఉతికితే మరకలు తొందరగా పోతాయి.

గోర్లని తెల్లగా మార్చడానికి

రెండు మూడు చుక్కల హైడ్రోజన్ పెరాక్సైడ్ లో రెండు నీటి చుక్కలు కలుపుకుని దానిలో గోర్లని నానబెట్టి, స్క్రబ్ చేస్తే గోర్లు తెల్లగా మారతాయి.

Read more RELATED
Recommended to you

Latest news