చావు తెలివితేటలు చూపిస్తున్న నిర్భయ దోషులు.. ఒకటిన కూడా డౌటే..?

-

నిర్భయ కేసులో నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయబోతన్నారు. దానికి సంబంధించి తీహార్ జైల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఉరిశిక్షను వాయిదా వేసేందుకు దోషులు రకరకాలుగా చావు తెలివితేట‌లు చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కేసులో రెండో దోషి వినయ్‌కుమార్‌ శర్మ బుధవారం రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలుచేయగా, మూడో దోషి అక్షయ్‌కుమార్‌ సింగ్‌ సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ను దాఖలు చేశాడు. దీంతో నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు మరోమారు వాయిదా పడనుందా? అన్న అనుమానాలు వ‌స్తున్నాయి. అయితే ముఖేశ్ దాఖలు చేసిన అన్ని పిటిషన్లూ తిరస్కరణకు గురి కావడంతో, అతని ముందున్న న్యాయ మార్గాలన్నీ మూసుకుపోయినట్లే.

ఇదే సమయంలో జైలు నిబంధనల మేరకు, ఒకే కేసులో శిక్ష పడిన నలుగురు నిందితులనూ ఒకేసారి ఉరి తీయాల్సి వుంటుంది. ఈ క్రమంలో అక్షయ్ వేసిన క్యూరేటివ్ పిటిషన్ పై నేడు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కోర్టు దీన్ని తిరస్కరిస్తే, అక్షయ్, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరవచ్చు. రాష్ట్రపతి కూడా నిరాకరిస్తే, తిరిగి రివ్యూ పిటిషన్ ద్వారా న్యాయ సమీక్షను కోరవచ్చు. ఆపై మరో నిందితుడు వినయ్ కూడా ఇదే విధానాన్ని అనుసరించే వీలుంటుంది. ఈ నేపథ్యంలో ఒకటో తేదీన వీరికి శిక్ష అమలు దాదాపుగా ఉండకపోవచ్చని న్యాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news