రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రో ఉత్పత్తులు GSTలోకి : నిర్మలా సీతారామన్

-

ఇంధన వనరులను GST పరిధిలోకి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్రాలు దీనికి అంగీకరిస్తే వీలైనంత త్వరగా పెట్రో ఉత్పత్తులను GST పరిధిలోకి తీసుకు వస్తామని తెలిపారు. పెట్రోలు ధరలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ యోచన చేస్తున్నట్లు వెల్లడించారు.

రికార్డు స్థాయిలో ఉన్న పెట్రోల్‌ ధరలను నియంత్రించేందుకు.. వాటిని జీఎస్​టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు అంతకంతకూ పెరుగుతున్నాయని నిర్మలమ్మ అన్నారు.. రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్​టీ పరిధిలోకి తీసుకురావడం సాధ్యమవుతుందని సీతారామన్‌ వెల్లడించారు. ఇందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. ఇప్పటివరకు జీఎస్‌టీ మండలిలో దీనిపై ఎలాంటి ప్రతిపాదనలు చర్చకు రాలేదనీ తెలిపారు.

పీహెచ్‌డీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ సభ్యులతో జరిగిన చర్చా కార్యక్రమంలో కేంద్ర మంత్రి సీతారామన్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్​టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి బదులిచ్చారు. రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే అది సాధ్యమవుతుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version