NITHIN 32 : నితిన్ కొత్త సినిమా ప్రారంభం.. ‘పెళ్లి సందD’ బ్యూటీతో రొమాన్స్‌ !

-

టాలీవుడ్‌ టాలెంటెడ్‌ హీరో నితిన్‌ వరుస సినిమాలతో ఫుల్‌ జోష్‌ లో ఉన్నాడు. ప్రస్తుతం నితిన్‌ మాచర్ల నియోజక వర్గం సినిమా చేస్తున్నాడు. రాజ్‌ కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో… ఆదిత్య మూవీస్‌ అండ్‌ ఎంటర్‌ టైన్ మెంట్స్‌, శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్స్‌ పై ఎం ఎస్‌ రాజ శేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో… ఈ సినిమా తెరకెక్కుతోంది. మాచర్ల నియోజక వర్గం సినిమాను సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే.. ఈ మూవీ రిలీజ్‌ కాకముందే.. మరో సినిమా షురూ చేసేశాడు నితిన్‌.

అయితే.. ఈ కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం ఇవాళ జరిగింది. ఇది నితిన్‌ కు 32 వ సినిమా. ఈ మూవీని నితిన్‌ తన సొంత బ్యానర్‌ శ్రేష్ట మూవీస్‌ లో తెరకెక్కిస్తున్నాడు. అలాగే.. ప్రముఖ రైటర్‌ వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. ఇక ఇవాళ ఈ సినిమా పూజా కార్యక్రమం జరుగగా.. ఆ ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news