పాకిస్తాన్ లో రాజకీయంలో నాటకీయ పరిణామాలు ఏర్పడుతున్నాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాక్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడు ఆరీఫ్ అల్వీకి సిఫారసు చేశారు. దీంతో ఆరీఫ్ అల్వీ పాక్ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మద్యంతర ఎన్నికలకు తెరలేచింది. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండనున్నారు. మొత్తం పాక్ జాతీయ అసెంబ్లీలోని 342 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
అంతకుముందు ఈరోజు పాక్ జాతీయ అసెంబ్లీలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్ జరగాలి. అయితే స్పీకర్ ఈ తీర్మాణాన్ని తోసిపుచ్చడంతో పాక్ ప్రధానికి ఊరట లభించింది. ఈరోజు జరిగిన సమావేశాలకు పాక్ ప్రధాని కూడా హాజరు కాలేదు. ముందస్తుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం ఎన్నికలకు వెళ్లారు. విదేశీ కుట్రలను సాగనివ్వబోమని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇదిలా ఉంటే పాక్ ప్రతిపక్షాలు సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించనున్నాయి. అవిశ్వాస తీర్మాణానికి అనుమతి ఇచ్చిన తర్వాత చర్చ జరగకుండానే తోసిపుచ్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.