భీష్మ మూవీ రివ్యూ.. ఎంటర్టైన్మెంట్ తో కం బ్యాక్ ఇచ్చిన నితిన్

-

 

 

విడుదల తేదీ : ఫిబ్రవరి 21, 2020

మనలోకం.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : నితిన్ , రష్మిక

దర్శకత్వం : వెంకీ కుడుముల

నిర్మాత‌లు : నాగ వంశీ

సంగీతం : స్వర సాగర్

భీష్మ మూవీ రివ్యూ …

 

టాలీవుడ్ స్టార్ యంగ్ హీరో నితిన్ నటించిన లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాలు హ్యాట్రిక్ డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో నితిన్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకోవడం జరిగింది. అయితే నెక్స్ట్ చేయబోయే సినిమా ఎలాగైనా హిట్ పడాలని తనకి కలిసివచ్చే కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ స్టోరీ కలిగిన ‘భీష్మ’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు నితిన్.

కథ – విశ్లేషణ : “భీష్మ ఆర్గానిక్ కంపెనీ” సీఈఓగా అనంత్ నాగ్ పని చేస్తుంటారు. వ్యవసాయ రంగానికి మంచి చేయాలనే భావన తో అనంత్ నాగ్ తన కంపెనీ ద్వారా సరికొత్త పద్ధతులను కనిపెట్టడానికి నిత్యం ప్రయత్నం చేస్తుంటారు. ఇదే సమయంలో అనంత్ నాగ్ భీష్మ ఆర్గానిక్ కంపెనీకి వ్యతిరేకంగా క్రిమినల్ మైండ్ మరియు కార్పొరేట్ కంపెనీ హెడ్ అయిన రాఘవన్ ప్రతి విషయంలో పోటీ పడుతూ అడ్డుపడుతుంటాడు. కాగా లైఫ్ లో ఏ గోల్ మరియు గురి గమ్యం లేకుండా సింగిల్ గా బతుకుతుంటాడు భీష్మ(నితిన్). ఇటువంటి సమయంలో నితిన్…రష్మీక నీ చూసి ప్రేమలో పడతాడు. అయితే కొన్ని అనుకోని సంఘటనల వల్ల నితిన్ “భీష్మ ఆర్గానిక్ కంపెనీ” కి మేనేజర్ అవుతాడు. అలా మేనేజర్ అయ్యాక నితిన్ ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు..? క్రిమినల్ మైండ్ కలిగిన జిష్షు నీ ఏ విధంగా ఆట పట్టించాడు, ఎలా ఆపగలిగాడు? అసలు కంపెనీ బాధ్యతలు నితిన్ చేపట్టాల్సిన అవసరం మరియు కారణం ఎందుకు వచ్చింది..? అది తెలియాలంటే ఈ సినిమా హాల్ లో చూడాల్సిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ నటించిన “అఆ” లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సరైన సినిమా నితిన్ కి బాక్సాఫీస్ దగ్గర పడలేదు. దీంతో చాలా టైం తీసుకున్నాడు నితిన్. కాగా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం తోనే ఫస్ట్ సినిమా చలోతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ వెంకీ కుడుముల. చలో సినిమా పనితనం బాగుండటంతో నితిన్…వెంకీ కుడుముల తో భీష్మ సినిమా చేయడం జరిగింది. సినిమాకి సంబంధించి స్టార్టింగ్ లో పెద్దగా బజ్ లేకపోయినా కానీ..సాంగ్స్ రిలీజ్ అయ్యే టైంకి సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా కి ఫస్ట్ హాఫ్ చాలా పెద్ద పాజిటివ్ పాయింట్ అని చెప్పాలి .. ఎక్కడా బోర్ కొట్టకుండా పూర్తి కామెడీ తో ఇంట్రెస్టింగ్ గాతీసుకెళ్తాడు డైరెక్టర్ వెంకీ కుడుముల. గత చిత్రాలలో నితిన్ నటించని… కొత్త యాంగిల్ ని ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్. అదేవిధంగా తనలోని వెంకీ కుడుముల తీసిన కొత్త యాంగిల్ కి సిల్వర్ స్క్రీన్ పై 100% న్యాయం చేసాడు నితిన్.

 

Image result for bheeshma

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి సంబంధించి థీమ్ ఏమిటి అన్నది దర్శకుడు ట్రైలర్ లోనే రివీల్ చేయడం జరిగింది. దీంతో సినిమా చూస్తున్నంతసేపు మరింత ఇంట్రెస్ట్ కనిపించేలా డైరెక్టర్ పనితనం ఉంటుంది. ఛలో సినిమా తరహా లో సీరియస్ హడావిడి మధ్యలో కామెడీ పండించి భేష్ అనిపించాడు డైరెక్టర్. వెన్నెల కిశోర్ కారెక్టర్ అద్భుతంగా వర్క్ అయ్యింది. సినిమాలో ఫస్టాఫ్ అంతా అక్కడక్కడ కామెడీ మరియు ఇంటర్వెల్ సమయంలో చోటు చేసుకున్న చిన్న ట్విస్ట్ పూర్తిగా ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ఇక సినిమాకి సంబంధించి సెకండాఫ్ విషయానికి వస్తే.., ఫస్టాఫ్ కి పూర్తి భిన్నంగా సెకండాఫ్ మొత్తం ఓ రేంజ్ లో పైకి లేపాడు వెంకీ కుడుముల. సెకండాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో ఒక దానికి మించి మరొకటి ఉంటాయి. అదే విధంగా యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. అనంతనాగ్ మరియు నితిన్ ల మధ్య వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్ సినిమాకి హైలెట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. హీరో హీరోయిన్ ల మధ్య కెమిస్త్రీ బాగుంది . కామెడీ ట్రాక్ తోనే సినిమా ని నిలబెట్టాడు డైరెక్టర్, అందుకోసం వెన్నెల కిశోర్ కారెక్టర్ ని బాగా రాసుకున్నాడు .

మైనస్ పాయింట్స్:

చాలా తేలికగా అంచనా వేయగలిగే కథ ఈ సినిమా కి పెద్ద మైనస్ అనే చెప్పాలి. తేలికపాటి స్టోరీ లైన్ తీసుకోవడం తో రాబోయే సన్నివేశం ఎలా ఉంటుంది అనేది ప్రేక్షకులు చాలా తేలికగా చెప్పేయగలుగుతారు. సెకండ్ హాఫ్ లో బోరింగ్ శాతం కాస్త ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ రెండే ఈ సినిమా కి మైనస్ లు.

ఇక నటీనటుల విషయానికి వస్తే సినిమాలో నితిన్ మరియు రష్మిక మందన ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు స్క్రీన్ పై బాగా పండాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదరగొట్టింది. సాంగ్స్ కూడా హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమాలో కీలక నటుడిగా విలన్ గా నటించిన జిష్షు గుప్త మరోసారి టాలీవుడ్ లో మంచి హాట్ టాపిక్ అవుతాడని చెప్పాలి. డైరెక్టర్ పనితనాన్ని గురించి మాట్లాడుకుంటే ఫస్టాఫ్ ఒకటి మాత్రమే మైనస్, సెకండాఫ్ తో సినిమాని పూర్తిగా ఒకపక్క కామెడీ ఎంటర్ టైన్ చేస్తూ మరోపక్క యాక్షన్ సీన్స్ తో స్టోరీని లాక్కొచ్చారు.

ఓవరాల్ గా

వరుస ప్లాపులతో సతమతమవుతూ చాలా టైమ్ తీసుకుని నితిన్ చేసిన ‘భీష్మ’ ప్రేక్షకులను బాగానే అలరించింది. చాలా డీసెంట్ గా ఓ పద్ధతి ప్రకారం కామెడీ మరియు యాక్షన్ సన్నివేశాలతో నితిన్ భీష్మ తో ఫస్ట్ డే నుంచే హిట్టు సినిమా అని చెప్పుకోవచ్చు. డీసెంట్ గా ఉన్న ఈ సినిమా, కామెడీ ఎక్కువగా ఉండటంతో ఈ వీకెండ్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రావచ్చు. ఫామిలీస్ కి కూడా ఈ మధ్య కామెడీ సినిమా ల మీద ఇంటరెస్ట్ పెరగడం నితిన్ కి కలిసొచ్చే అంశం గా చెప్పుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news