కరోనా రెండో వేవ్ లో దేశ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రుల కొరత, బెడ్ ల కొరతతో ప్రస్తుత పరిస్థితి ఆందోళనగా ఉంది. రెండో వేవ్ ని అడ్డుకోవడం అనేది కేంద్రానికి సాధ్యం కావడం లేదు. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి కీలక వ్యాఖ్యలు చేసారు. భారతదేశం మూడు, నాలుగు వేవ్ లు అడ్డుకోవడానికి సిద్దంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని ఆయన సూచించారు. దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఆక్సీజన్ కొరతను తీర్చడానికి తాము రాష్ట్రాలతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందకుండా ప్రభుత్వాలకు సహకరించాలని కరోనాకు కీలకమైన ఔషధాల కొరతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. రెమ్‌డెసివిర్‌కు పెరుగుతున్న డిమాండ్‌పై, గడ్కరీ మాట్లాడుతూ జెనెటెక్ లైఫ్ సైన్సెస్ ఈ రోజు నుండి వార్ధాలో ఉత్పత్తిని ప్రారంభించింది అన్నారు. 30 వేల డోస్ లను ఉత్పత్తి చేస్తామని చెప్పారు.