గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నివేదా థామస్.. కారణం అదేనా..?

-

సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులకు ప్రముఖ హీరోయిన్ నివేదా థామస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈమె నిన్ను కోరి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి జెంటిల్మెన్ సినిమాతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఇక పలు విభిన్న సినిమాలలో నటించి అలరించిన నివేదా థామస్ చివరిసారిగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించింది. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అత్యంత ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.ప్రస్తుతం నివేదా థామస్ సినిమాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు సైతం తెగ ఆత్రుతగా ఈమె గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరి కొంతమంది ఈమె సినిమాలలో నటిస్తోందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.Nivetha Thomas Wallpaper Download | MobCup ఇకపోతే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ ఉండే ఈమె సినిమాలు ఎందుకు కమిట్ అవ్వడం లేదు అనే విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. అయితే అందుకు కారణం తాజాగా ఈమె బరువు తగ్గి పూర్తిగా సన్న పడిపోయింది.Nivetha Thomas Wallpaper Download | MobCup

గతంలో బొద్దుగా, ముద్దుగా ఉన్న నివేదా ఇప్పుడు సన్నబడి బక్క చిక్కిపోవడంతో కొంతమంది నెగటివ్ కామెంట్లు చేస్తుంటే మరికొంతమంది చాలా బాగుంది అంటూ పాజిటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే రీ యంట్రీ ఇవ్వడం కోసమే ఈమె ఇలా సన్నబడిపోయింది అంటూ వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. కానీ ఈమె మాత్రం వరుస సినిమాలలో నటించాలని అనుకుంటుంటే.. నివేదా మాత్రం వస్తున్న ఆఫర్లను తిరస్కరిస్తున్నట్లు సమాచారం. మరి కనీసం ఇప్పుడైనా తను రీఎంట్రీ ఇస్తుందో లేదో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news