హైదరాబాదులో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ గణేశుడు పంచముఖ మహాలక్ష్మి గణపతిగా దర్శనమిస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలను ఘనంగా చేయమని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
బోనాలు , బతుకమ్మ , గణేష్ ఉత్సవాలు ఇలా అన్ని పండుగలను ఎంతో గొప్పగా చేస్తున్నామన్నారు మంత్రి తలసాని. అన్ని పండుగలకు నిధులు మంజూరు చేసి వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఖైరతాబాద్ గణేష్ ను మట్టి తో తయ్యారు చేసి అందరికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్ని శాఖల సమన్వయం తో గణేష్ ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామన్నారు.