మెంటల్ మదిలో హీరోయిన్ కి ఫాగల్ లో అవకాశం..

మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించిన విమర్శకులచే ప్రశంసలు అందుకున్న నివేథా పేతురాజ్, తాజాగా మరో కొత్త సినిమాలో అవకాశం అందుకుంది. నాన్ బాహుబలి హిట్ గా నిలిచిన అల వైకుంఠపురములో నటించిన ఈ అమ్మడుకి పాగల్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఫలక్ నుమా దాస్ సినిమాతో హిట్ అందుకున్న విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నివేథా పేతురాజ్ కూడా భాగం కానుందని వినిపిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. కొత్త దర్శకుడు నరేష్ రెడ్డి రూపొందిస్తున్న ఈ సినిమా, లాక్డౌన్ కంటే ముందే మొదలైనా, ఇటీవల తాజాగా చిత్రీకరణ మొదలుపెట్టారు. గ్లామర్ పరంగానూ, నటన పరంగానూ అందరి మన్ననలు పొందుతున్న నివేథా, ఈ సినిమాతో తెలుగులో బిజీ హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి.