మరి కాసేపట్లో నిజామాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్.. 14 సమస్యాత్మక ప్రాంతాలు !

-

మరి కాసేపటిలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పొలింగ్ మొదలుకానుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 824 ఓటర్లు, నిజామాబాద్ లో 483, కామారెడ్డి లో 341 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మొత్తం 50 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు మొత్తం 399 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఉమ్మడి జిల్లాలో 14 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, 48 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ జరగనుండగా ప్రాధాన్యత క్రమంలో ఓటర్లు ఓటు వేయనున్నారు.

12న కౌంటింగ్ జరగనుండగా ఓకే రౌండ్ లో ఫలితం తేలపోనున్నది. ఈ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ జరగనున్నది. 824 మంది ఓటర్లలో 24 మందికి కరోనా పాజిటివ్ రావడంతో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారి ఇళ్ల నుంచి పీపీఈ కిట్లతో అంబులెన్స్ లో తీసుకొచ్చి లాస్ట్ హావర్స్ లో ఓటు వేయించెలా ఏర్పాట్లు చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి 4 పీపీయీ కిట్లు ఫేస్ షీల్డ్ లు మాస్కులూ గ్లౌజు లు శానిటైజర్ లు పంపిణీ చేయనున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో మెడికల్ ఆఫీసర్, ఒక ఎఎన్ ఎం, ఆశా కార్యకర్తలని మొహరిచారు. అలానే థర్మల్ స్క్రీన్ ద్వారా టెంపరేచర్ చూశాకే, ప్రతీ ఓటరు మాస్క్ గ్లౌజులు ధరిస్తెనే లోనికి అనుమతి ఇచ్చేలా ప్లాన్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news