నిజామాబాద్ఎంపీ అర్వింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ లోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని.. పార్టీలో చేరి పని చేయని నేతలను సహించేది లేదని హెచ్చరించారు. తన ద్వారా పార్టీలోకి వచ్చినంత మాత్రాన టికెట్ గ్యారంటీ ఏమి లేదని… నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు స్థానాల్లో గెలవడమే తన లక్ష్యమన్నారు. తెరాస ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారని… రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు ఉంటాయన్నారు.
పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీ కి కూడా పోటీ చేస్తానని.. ఏ స్థానంలో అయినా పోటీకి సిద్ధమని చెప్పారు. తెలంగాణపై భాజపా ఫోకస్ పెట్టిందని… రాష్ట్రంలో భాజపా ఒంటరిగా పోటీ చేస్తుందని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, తెరాస మధ్య పొత్తుకు అవకాశం ఉందని.. తెరాస పై అందుకే దూకుడుగా ఉన్నామన్నారు. ఈడీ నోటీసుల భయంతోనే కేసీఆర్ దిల్లీకి పరుగులు పెడుతున్నారని.. ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబం విదేశాలకు పరారు అవ్వడం ఖాయం అని పేర్కొన్నారు. డీఎస్ ఏ పార్టీలో చేరాలన్నది ఆయన నిర్ణయమే అంతిమమని చెప్పారు.