నిజామాబాద్ వాసికి దుబాయ్‌లో రూ.28 కోట్ల లాట‌రీ..!

-

దుబాయ్ ఎయిర్‌పోర్టులో ప్ర‌తి నెలా బిగ్ టికెట్ పేరిట లాట‌రీ నిర్వ‌హిస్తుంటారు. ఈ క్ర‌మంలో అందులో లాట‌రీ త‌గిలిన వారికి రూ.28 కోట్ల ప్రైజ్ మ‌నీ వ‌స్తుంది.

సొంత ఊరిని, క‌న్న‌వారిని, కుటుంబ స‌భ్యులను వ‌దిలిపెట్టి ఎంతో మంది గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్లి ప‌నులు చేస్తుంటారు. అలాగైనా డ‌బ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించాల‌ని వారు తాప‌త్ర‌య ప‌డుతుంటారు. అయితే గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్లి ప‌నులు చేసే వారి బాధ‌లు వ‌ర్ణ‌నాతీతంగా ఉంటాయి. గ‌తంలోనే మ‌నం చాలా మంది జీవితాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూశాం. అక్క‌డికి వెళ్లినవారు మ‌రింత ఇబ్బంది ప‌డుతారు కానీ.. ఎవరూ బాగా డ‌బ్బు సంపాదించిన దాఖ‌లాలు లేవు. అయితే అలాంటి ఇబ్బందులు ప‌డుతున్న ఆ వ్య‌క్తిని అదృష్ట ల‌క్ష్మి వ‌రించింది. అతనికి లాట‌రీలో కొన్నికోట్ల రూపాయ‌లు త‌గిలాయి.

నిజామాబాద్ జిల్లా జ‌క్రాన్‌ప‌ల్లికి చెందిన రిక్కాల విలాస్‌, ప‌ద్మ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు. పెద్ద కూతురు పేరు హిమాని. ఆమె ఇంట‌ర్ చ‌దువుతోంది. రెండో కూతురు మ‌న‌స్విని 8వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. అయితే వీరిది వ్య‌వ‌సాయ ఆధారిత కుటుంబం. కానీ అందులో ఎప్పుడూ న‌ష్టాలే వ‌చ్చేవి. దీంతో ఆదాయం స‌రిపోవ‌డం లేద‌ని భావించిన విలాస్ 45 రోజుల కింద‌ట దుబాయ్ వెళ్లాడు. అయితే అక్క‌డా అత‌నికి నిరాశే ఎదురైంది. దీంతో తిరిగి స్వ‌గ్రామానికి చేరుకున్నాడు.

nizamabad person won dubai big ticket lottery

కాగా దుబాయ్ ఎయిర్‌పోర్టులో ప్ర‌తి నెలా బిగ్ టికెట్ పేరిట లాట‌రీ నిర్వ‌హిస్తుంటారు. ఈ క్ర‌మంలో అందులో లాట‌రీ త‌గిలిన వారికి రూ.28 కోట్ల ప్రైజ్ మ‌నీ వ‌స్తుంది. అయితే విలాస్ త‌న భార్య ద‌గ్గ‌ర ఉన్న రూ.20వేల‌ను అడిగి తీసుకుని దుబాయ్‌లో ఉన్న త‌న స్నేహితుడికి పంపి ఆ డ‌బ్బుతో లాట‌రీ టిక్కెట్లు కొన‌మ‌ని చెప్పాడు. అత‌ను అలాగే కొన్నాడు. కాగా మొత్తం విలాస్ 3 టిక్కెట్లు కొన‌గా.. అందులో ఒక టిక్కెట్‌కు జాక్‌పాట్ త‌గిలింది. రూ.28.40 కోట్ల ప్రైజ్ మ‌నీని విలాస్ గెలుచుకున్నాడు. దీంతో అత‌ని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎంతో కాలం నుంచి క‌ష్టాల‌తో నెట్టుకొస్తున్న అత‌నికి, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు లాట‌రీ త‌గ‌ల‌డం వ‌ల్ల ఎంతో సంతోషం క‌లిగింది. దీంతో త‌మ క‌ష్టాల‌న్నీ తీరిపోయాయ‌ని వారు చెబుతున్నారు. అవును మరి.. అంత పెద్ద మొత్తంలో లాట‌రీ త‌గిలితే ఎవ‌రికైనా క‌ష్టాలు తీరుతాయి..!

Read more RELATED
Recommended to you

Latest news