NLC : కేంద్ర ప్రభుత్వ సంస్థలో 675 ఉద్యోగాలు… ఇలా అప్లై చెయ్యండి..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎల్‌సీ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

దీనిలో మొత్తం 675 అప్రెంటిస్‌లను భర్తీ చేయనుంది. ఇందులో ఫిట్టర్‌, ఎలక్ట్రిషన్‌, మెకానిక్‌, వెల్డర్‌, టర్నర్‌ వంటి ట్రేడ్‌లు ఉన్నాయి. అర్హత, ఆసక్తి వున్నవాళ్లు అప్లై చెయ్యచ్చు. పోస్టులకు ఎంపికనైన వారికి ఏడాదిపాటు శిక్షణ అందిస్తారు.

పోస్టులను బట్టి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఔ, డిగ్రీలో బీకామ్‌, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. వయసు 14 ఏళ్ల పైబడి ఉండాలి. అకడమిక్‌ మార్కులను బట్టి ఎంపిక చేస్తారు. ఆగస్టు 16, 2021 న దరఖాస్తులు ప్రారంభం అవుతాయి. ఆగస్టు 25, 2021 దరఖాస్తులకు చివరితేదీ. దరఖాస్తు హార్డ్‌ కాపీలను పండానికి చివరి తేది ఆగస్టు 30, 2021. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.nlcindia.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

పోస్టుల వివరాలు:

ఫిట్టర్‌- 90
టర్నర్‌- 35
మెకానిక్‌ – 95
ఎక్ట్రిషియన్‌- 90
వైర్‌మెన్‌- 90
మెకానిక్‌- 10 (డీజిల్‌ 5, ట్రాక్టర్‌ 5)
కార్పెంటర్‌- 5
ప్లంబర్‌- 5
స్టెనోగ్రాఫర్‌- 15
వెల్డర్‌- 90
పాసా- 30
అకౌంటెంట్‌- 40
డేటా ఎంట్రీ ఆపరేటర్‌- 40
హెచ్‌ఆర్‌ అసిస్టెంట్‌- 40

 

Read more RELATED
Recommended to you

Latest news