మార్పు లేదు.. ఆ నెలలోనే ‘ఓజీ’ మూవీ రిలీజ్: నిర్మాత డీవీవీ దానయ్య

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఓ జి.. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టార్ డ్రామాగా సుజీత్ దర్శకత్వంలో ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ తెరకెక్కుతోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పైన ఉన్నంత బజ్ పవన్ నటిస్తున్న ఇంకే సినిమా పైన లేదని చెప్పాలి. ఇకపోతే షూటింగ్ అప్డేట్, లొకేషన్ అప్డేట్స్, ఫస్ట్ లుక్ ఇలా ప్రతి విషయంపై కూడా ఎప్పటికప్పుడు అభిమానులకు కిక్కిచ్చే వార్తలను మేకర్స్ రిలీజ్ చేస్తూనే వస్తున్నారు.

ఇదిలా ఉంటే… ‘ఓజీ’ సినిమా విడుదల తేదీపై నిర్మాత డీవీవీ దానయ్య మరోసారి క్లారిటీ ఇచ్చారు. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 27న ‘ఓజీ’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. పవన్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘అత్తారింటికి దారేది’ కూడా 2013 సెప్టెంబరు 27నే విడుదలైంది. ఇప్పుడు అదే తేదీన ‘ఓజీ’ రానుండటంతో అభిమానులు సంబరపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news