ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కేవలం ఒక్క విజయాన్నే అందుకుంది. దీంతో మరోసారి ఆ జట్టు ప్రదర్శనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్సీబీ ఈ సీజన్ విజేతగా నిలవాలంటే విరాట్ కోహ్లి ఒక్కడిపైనే ఆధారపడటం సరికాదని వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. ఏడెనిమిది మ్యాచుల్లో గెలిపించే ఇన్నింగ్స్ ఆడటం కోహ్లికి కూడా అసాధ్యమని వ్యాఖ్యానించారు. కాగా ఈ సీజన్లో ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిన్, మ్యాక్స్వెల్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు.
కాగా, నిన్న లక్నోతో మ్యాచులో ఆర్సీబీ ఓటమి పాలైంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 153 రన్స్ మాత్రమే చేసి, ఆలౌటైంది. దీంతో లక్నో 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరిలో లామ్రోర్ (13 బంతుల్లో 33) మెరుపులు మెరిపించినా లాభం లేకుండా పోయింది. లక్నో బౌలర్ మయాంక్ యాదవ్ 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశారు.