విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండచరియలు పడిన ఘటనలో అన్ని కొండరాళ్లను అధికారులు తొలగించారు. అయితే ముందు నుండి అనుమానించినట్టుగా ఆ రాళ్ల కింద ఎవరు లేకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ కొండచరియలు విరిగిపడిన సమయంలో ముగ్గురికి గాయాలు అయ్యాయి, అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే కొండచరియలు విరిగిపడడంతో అప్రమత్తం అయిన అధికారులు, కొండచెరియలు పడిన ప్రాంతంలో ఫైర్ ఇంజిన్ సహాయంతో డ్రమ్ములలో నీటిని నింపుతున్నారు అధికారులు. మరోసారి కొండచరియలు విరిగిపడినా అవి మరింత దూరం అంటే జనాల మీదకు రాకుండా ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఈ ఉత్సవాలు పూర్తి అయ్యాక పటిష్టమైన చర్యలు చేపడతామని అంటున్నారు అధికారులు.