గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో తాజాగా బంగారం ధర రూ.380 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,330కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల మీద కూడా రూ.350 పెరగడంతో ధర రూ.47,050 అయింది. అలానే కొన్ని రోజులుగా ఢిల్లీ మార్కెట్‌లో స్థిరంగా కొనసాగుతోన్న ధరలు కూడా ఈరోజు పెరిగాయి.
24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై రూ.310 పెరగడంతో ధర రూ.54,100కి ఎగసింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.290 పెరగడంతో ధర రూ.49,600కి పెరిగింది. ఇక నిన్న తగ్గిన వెండి ధర కూడా భారీగా పెరిగింది. తాజాగా వెండి ధర రూ.1500 మేర పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.63,500 వద్ద ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం బంగారం ధర పడి పోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.52 శాతం తగ్గడంతో 1919 డాలర్లకు తగ్గింది. బంగారం ధరతో పాటు వెండి ధర తగ్గింది. వెండి ధర ఔన్స్‌కు 1.13 శాతం తగ్గడంతో 24.94 డాలర్లకు దిగొచ్చింది.