EVMలు వద్దు.. పేపర్ బ్యాలెట్టే ముద్దు : CPI నారాయణ

-

ప్రపంచ వ్యాప్తంగా ఈవీఎం మెషీన్లు గురించి గత రెండు రోజులుగా చర్చించుకోవడం గమనార్హం. ముఖ్యంగా ఎలన్ మస్క్ ఈవీఎంల పై ట్వీట్ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈవీఎం ప్రస్తావన కాస్త ఎక్కువ అయిందనే చెప్పాలి. తాజాగా ఈవీఎం గురించి సీపీఐ నారాయణ మీడియాతో మాట్లాడారు.

ప్రపంచంలోని చాలా దేశాలు ఈవీఎం సిస్టమ్ ను ఫాలో కావడం లేదని చెప్పారు. అమెరికా, జపాన్ వంటి దేశాలు సైతం ఈవీఎంలను వినియోగించకూడదని నిర్ణయించుకున్నాయి. కానీ భారత్ మాత్రం ఈవీఎం పద్దతినే ఫాలో అవుతుంది. ఈవీఎం పద్దతిని ఎందుకు వద్దనుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెట్ ముద్దు అనే నినాదాన్ని ఫాలో కావాలని సూచించారు సీపీఐ నారాయణ. ఈవీఎంలు వినియోగించకుండా.. బ్యాలెట్ పద్దతీలోనే ఏ ఎన్నికలైనా నిర్వహించాలని సూచించారు. ఈ విషయం పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news