పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా విజయం సాధించిన రఘునందన్ రావు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో తాజాగా భేటీ అయ్యారు. రెండో దఫా మెట్రో లైన్ విస్తరణలో భాగంగా పటాన్ చెరు వరకు పొడిగించాలని ఎంపీ హోదాలో వినతి పత్రం అందజేశారు. ఎంపీ వినతిపై సానుకూలంగా స్పందించిన మెట్రో ఎండీ 30 రోజుల్లో డీపీఆర్ సిద్దం చేసి గ్రౌండ్ రిపోర్ట్ తెప్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఈ బేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో భాగంగా నా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి దశలోనే పటాన్ చెరు వరకు మెట్రో తీసుకొస్తానని, రెండో దశలో సంగారెడ్డి చౌరస్తా వరకు మెట్రో తీసుకొస్తానని ఎంపీ రఘునందన్ రావు చెప్పుకొచ్చారు.