తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ షాక్‌..ఆ బదిలీలు లేనట్లే !

తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ మరో దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలోని కొత్త జోనల్‌ విధానం కింద జిల్లా, జోన్లు, బహుళ జోన్లలో ఉద్యోగుల బదలాయింపుల దృష్ట్యా ఈ ఏడాది సాధారణ బదిలీలు చేపట్టరాదని కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

ఇటీవల అన్ని శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, డైరెక్టర్లు, జిల్లా కలెకర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరన్స్‌ సమీక్షో ప్రభుత్వం ఈ సంకేతాలను ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ రాష్ట్రంలో.. ఉద్యోగులకు బదిలీలు జరిగాయి. సాధారణ బదిలీలు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని ఏటా కోరుతున్నాయి.

అయితే..ఈ ఏడాది ఆ బదీలు జరుగుతాయని అందరూ ఆశించారు. కానీ.. కొత్త జోనల్‌ విధానం అమలులోకి రావడంతో కేసీఆర్‌ సర్కార్‌ వాటికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు, బదలాయింపులను చేపట్టింది. దీంతో సాదారణ బదీలలకు బ్రేక్‌ పడింది. ఇక ఈ సమయంలో సాధారణ బదీలలను చేపట్టవద్దని కేసీఆర్‌ సర్కార్‌ ఆలోచన చేస్తుందట.