యూపీ ఎన్నికల్లో టాలీవుడ్ హీరోయిన్ !

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. దీంతో అన్ని పార్టీలు.. ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ సారి ఎలాగైనా… సీఎం పదవిని దక్కించుకోవాలని ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, ఇటు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక అటు ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో.. కాంగ్రెస్‌ కూడా ఈ సారి దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల కిందట.. 125 అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్‌ పార్టీ.

అయితే… ఈ జాబితాలో హాట్‌ బ్యూటీ అర్చనా గౌతమ్‌ కూడా ఉండటం గమనార్హం. దీంతో రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది అర్చనా గౌతమ్‌. ఉత్తర ప్రదేశ్‌ లోని.. హస్తినా పూర్‌ అసెంబ్లీ టికెట్‌ ను కాంగ్రెస్‌ హైకమాండ్‌ అర్చనా గౌతమ్‌ కు కేటాయించింది. యూపీలోని మీరట్‌ లో అర్చనా గౌతమ్‌ జన్మించింది. ఇప్పుడామె వయస్సు 26 ఏళ్లే మాత్రమే. కానీ 20 ఏళ్లకే సినిమాలలో ఎంట్రీ ఇచ్చి.. తక్కువ సమయంఓనే పాపులారిటీ సంపాదించుకుంది అర్చనా గౌతమ్‌.