ఎంత బాధ పడినా గతం మారదు… ఎంత ఆరాట పడినా భవిష్యత్తు తెలీదు..!

-

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే ఏ సమస్య ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఎవరూ చెప్పలేము. అయితే కాలాన్ని ఎవరు మార్చలేము. గడిచిన గతాన్ని ఎంత తలచుకున్నా సరే ఫలితం లేదు. ఎప్పుడూ కూడా గతాన్ని పదే పదే తలుచుకుని కుమిలిపోకూడదు. చాలా మంది గతంలో అయ్యో అలా చేశాను… ఇలా చేశాను.. ఇలా చేసి ఉండకూడదు అని తెగ బాధ పడుతూ ఉంటారు.

కానీ అలా బాధ పడడం ఏ మాత్రం మంచిది కాదు. అలానే గతం లో ఎదురైనా సందర్భాలని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. దీని వలన సమయం వృధా తప్ప ఎటువంటి ఫలితం లేదు. ఎప్పుడూ కూడా మనం గడిచిన గతాన్ని మార్చలేము. అలానే చాలా మంది కష్టపడకుండా ఏ పని చేయకుండా భవిష్యత్తు గురించి పదే పదే తలుచుకుంటూ ఉంటారు.

నిజానికి భవిష్యత్తు గురించి పగటి కలలు కంటూ ఉంటారు. భవిష్యత్తు గురించి ఎంత అరాట పడినా సరే అది ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. మనం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనుకుంటే అది మరొక్కలా ఉండొచ్చు. అంతేకానీ మనం ఊహించుకున్నంత మాత్రాన మన భవిష్యత్తు అదే ఎవ్వడు. గతం గురించి తెలుసుకోవడం వలన అది మారదు.

భవిష్యత్తు గురించి ఎంత ఆరాటపడిన అది తెలియదు. కాబట్టి అనవసరంగా గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించొద్దు. వర్తమానంపై దృష్టి పెట్టి.. ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా వినియోగించుకోండి. ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండండి. చక్కగా మీ లక్ష్యంపై ఏకాగ్రత పెట్టి ముందుకు వెళ్ళండి అప్పుడు తప్పక విజయం మీదే.

Read more RELATED
Recommended to you

Latest news