వాహనదారులకు శుభవార్త.. ఇకపై డాక్యుమెంట్స్ జేబులో పెట్టుకోనక్కర్లేదు..

-

వాహనదారులు ఇకపై డాక్యుమెంట్స్ జేబులో పెట్టుకు తిరగాల్సిన పనిలేదట. ఈ మేరకు రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రోడ్డుపై తిరిగే వాహనదారులు డాక్యుమెంట్స్ వెంట తెచ్చుకోవాల్సిన అవసరం లేదని, వాటిని ఆన్ లైన్ లో భద్రపర్చుకుంటే చాలని పేర్కొంది. అక్టోబర్ 1వ తేదీ ఈ విధానం అమల్లోకి రానుందట. తనిఖీ నిమిత్తం ట్రాఫిక్ పోలీసులు, చెక్ పోస్టు నిర్వాహకులు వాహనాన్ని ఆపినపుడు ఆన్ లైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూపిస్తే సరిపోతుందట.

 

2019లో వచ్చిన మోటార్ వాహనాల చట్టానికి అనుగుణంగా ఈ నియమాలని పొందుపర్చారట. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం, వాహనదారులకి ఇబ్బందిగా కలిగించకుండా ఉండడానికే అని సమాచారం. వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆన్ లైన్లో ఉంచుకోవాలట. ఛలాన్లు కూడా ఆన్ లైన్లోనే వస్తాయట. అక్టోబర్ 1వ తేదీ నుండి ఈ నియమాలన్నీ అమల్లోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news