‘బింబిసార‌’ సినిమాకు అన్నయ్య తప్ప ఎవ్వడు సెట్‌ కాడు – ఎన్టీఆర్‌

-

‘బింబిసార‌’ సినిమాకు అన్నయ్య తప్ప టాలీవుడ్‌ పరిశ్రమలో ఎవ్వడు సెట్‌ కాడని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. కళ్యాణ్ రామ్ నటించిన “బింబిసార” ఆగస్ట్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సినిమా, దర్శకుడు వశిష్టపై, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్‌పై ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు. సినిమా చూసి కాలర్ ఎగరేసుకునేంత వరకు రిజల్ట్‌ను పట్టించుకోకుండా సినిమాలు చేస్తూనే ఉంటాను’’ అని కొన్నాళ్ల క్రితం అదే వేదికపై వాగ్దానం చేశాను.

కళ్యాణ్ రామ్‌ని బింబిసారలో చూసిన తర్వాత మీరు. నిస్సందేహంగా కాలర్‌ ఎగురవేస్తారని తెలిపారు. ఇండస్ట్రీకి గడ్డు కాలం అంటున్నారు థియేటర్స్ కి జనాలు రావడం లేదు అంటున్నారు ఇదంతా నేను నమ్మనని.. అద్భుతమైన చిత్రం వస్తె చూసి ఆశీర్వదించే గొప్ప హృదయం వున్న తెలుగు ప్రేక్షక దేవుళ్ళు అని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news