మ‌ద్యం ప్రియుల‌కు చేదు వార్త‌.. ఇక‌పై వైన్ షాపుల‌కు ప‌ర్మిట్ రూంలు ఉండ‌వు..?

-

నివాసాలు ఉన్న ప్రాంతాల్లో ఉన్న మ‌ద్యం షాపుల వ‌ద్ద ప‌ర్మిట్ రూంలు ఉండ‌డం వ‌ల్ల చుట్టు ప‌క్క‌ల ఉన్న‌వారికి, మ‌హిళ‌ల‌కు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని గుర్తించారు. అందువ‌ల్ల అన్ని మ‌ద్యం షాపుల‌కు ఈసారి ప‌ర్మిట్ రూంల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది.

డ‌బ్బులు పెద్ద ఎత్తున ఖ‌ర్చు పెట్టి బార్ల‌లో మ‌ద్యం సేవించ‌లేని మందు బాబుల కోసం గ‌తంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ర్మిట్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చిన విష‌యం విదిత‌మే. లైసెన్సులు పొందిన మ‌ద్యం షాపు యజ‌మానులు మ‌రికొంత ఫీజును అద‌నంగా చెల్లించి ఈ పర్మిట్ రూంల‌ను పెట్టుకునేందుకు గ‌తంలో అవ‌కాశం క‌ల్పించారు. అయితే ఈ సారి మాత్రం ఈ పర్మిట్ రూమ్‌ల‌ను తీసేయ‌నున్నార‌ట‌. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లో అమ‌లులోకి రానున్న నూత‌న ఆబ్కారీ విధానం ప్రకారం.. అన్ని మ‌ద్యం షాపుల ప‌ర్మిట్ రూంలు మూత ప‌డ‌నున్న‌ట్లు తెలిసింది.

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుత ఆబ్కారీ విధానానికి సెప్టెంబ‌ర్ 31వ తేదీతో గ‌డువు ముగియ‌నుంది. దీంతో అక్టోబ‌ర్ 1 నుంచి నూత‌న విధానం అమ‌ల్లోకి రానుంది. అయితే ఈసారి కొత్త మ‌ద్యం దుకాణాలకు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌ని, పాత షాపుల‌నే కొన‌సాగించ‌వ‌చ్చ‌ని, అలాగే లైసెన్సు ఫీజు కూడా స్వ‌ల్పంగా పెర‌గ‌నుంద‌ని తెలిసింది. ఇక మద్యం షాపుల‌కు అనుబంధంగా ఉన్న ప‌ర్మిట్ రూంల‌ను కూడా తీసేయ‌నున్నార‌ట‌.

మ‌ద్యం షాపుల‌కు ప‌ర్మిట్ రూంల‌ను అనుమ‌తించ‌డం వ‌ల్ల అనేక ఇబ్బందులు క‌లుగుతున్నాయ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం దృష్టికి వ‌చ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా నివాసాలు ఉన్న ప్రాంతాల్లో ఉన్న మ‌ద్యం షాపుల వ‌ద్ద ప‌ర్మిట్ రూంలు ఉండ‌డం వ‌ల్ల చుట్టు ప‌క్క‌ల ఉన్న‌వారికి, మ‌హిళ‌ల‌కు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని గుర్తించారు. అందువ‌ల్ల అన్ని మ‌ద్యం షాపుల‌కు ఈసారి ప‌ర్మిట్ రూంల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. కాగా తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం 2216 మ‌ద్యం దుకాణాలు ఉండ‌గా, లైసెన్సుల రూపంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి మొత్తం రూ.1,360 కోట్ల ఆదాయం వ‌చ్చింది.

ఇక 50వేల లోపు జ‌నాభా ఉన్న ప‌ట్ట‌ణాల్లో మ‌ద్యం దుకానాల లైసెన్సు రుసుం రూ.45 ల‌క్ష‌లు ఉండ‌గా, 50వేల నుంచి 5 ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌నాభా ఉన్న ప‌ట్ట‌ణాల్లో ఈ రుసుం రూ.55 ల‌క్ష‌లుగా, 5 ల‌క్ష‌ల నుంచి 20 ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న న‌గ‌రాల్లో ఈ రుసుం రూ.85 ల‌క్షలుగా, 20 ల‌క్ష‌ల జ‌నాభా దాటిన న‌గ‌రాల్లో లైసెన్సు రుసుం రూ.1.10 కోట్లుగా ఉంది. గ‌త రెండు సంవ‌త్స‌రాల కాలానికి గాను ఈ రేట్ల‌ను అమ‌లు చేశారు. అయితే త్వ‌ర‌లో రానున్న నూత‌న ఆబ్కారీ విధానం వ‌ల్ల ఈ రుసుం స్వ‌ల్పంగా పెర‌గ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news