తమన్నా ప్రస్తుతం దటీజ్ మహాలక్ష్మీ, సైరా సినిమాల్లో నటిస్తోంది. ఆ సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి.
కొన్ని కొన్ని విషయాలు చూడటానికి చిన్నగానే అనిపిస్తాయి. కానీ.. అవి జీవితాంతం మనల్ని వెంటాడుతుంటాయి. అవి అంత తేలిగ్గా మనల్ని వదలవు. ఎప్పుడో ఒకప్పుడు గుర్తొస్తూనే ఉంటాయి.. నా జీవితంలోనూ అటువంటి ఓ ఘటన జరిగిందంటూ మిల్క్ బ్యూటీ తమన్నా చెప్పుకొచ్చింది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తనకు పదే పదే గుర్తొచ్చే ఆ విషయం గురించి తన అభిమానులతో పంచుకున్నది.
ఓసారి నా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్లాను. వెళ్లడానికి ముందు.. తనకు ఏదైనా మంచి బొకే తీసుకెళ్దాం అనుకున్నా. ఆ ఉద్దేశంతో ఓ బొకే షాప్ కు వెళ్లా. రెండు బొకేలు ఆర్డర్ ఇచ్చా. అయితే.. ఆ బొకేలో ఉన్న పువ్వులు నాకు నచ్చలేదు. దీంతో ఆ పువ్వులు తీసి నాకు నచ్చిన పువ్వులు పెట్టి సెట్ చేసి ఇవ్వమని చెప్పా. వాళ్లు కూడా నేను సూచించిన పువ్వులనే సెట్ చేసి కొత్త బొకేలను రెడీ చేశారు. బిల్లు పే చేద్దామని కౌంటర్ దగ్గరికి వెళ్లి ఎంతయింది అని అడిగా.. అంతే. నాకు షాక్ కొట్టినంత పనయింది.
ఎందుకంటే.. షాపు ఓనర్.. ఆరు వేలు అని చెప్పాడు. నాకు దిమ్మ తిరిగిపోయింది. అంటే.. ఒక్క బొకేకు 3 వేలు అన్నమాట. రెండు మూడు వేరే పువ్వులు పెట్టినంత మాత్రాన అంత బిల్లు వేస్తారా? పోనీ.. అవి వద్దని చెబుదామంటే వాటిని నేను నచ్చినట్టుగా చేసుకున్న బొకేలు కదా. వాటిని వద్దంటే వాళ్లు వినరు. ఏం చేసేది లేక.. ఏడ్చుకుంటూనే రెండు బొకేల డబ్బులు ఆరు వేలు కట్టి అక్కడి నుంచి బయటపడ్డా. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా.. ఎక్కడ బొకేలు కనిపించినా.. నాకు ఆ విషయమే గుర్తుకు వస్తుంది. బొకే షాప్ కు వెళ్లినా ఆ విషయమే గుర్తుకు వస్తుంది. ఆ ఘటనను నా జీవితంలో మరిచిపోలేను.. అంటూ ఆ ఘటనను గుర్తు
చేసుకుంది తమన్నా.
తమన్నా ప్రస్తుతం దటీజ్ మహాలక్ష్మీ, సైరా సినిమాల్లో నటిస్తోంది. ఆ సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి.