వలసనేతలకు అందలం.. కర్నెకు మొండిచేయి?

-

టీఆర్ఎస్‌లో రాను రాను ఉద్యమ నేతలకు స్థానం ఉండేలా కనిపించడం లేదు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి అనేకమంది నేతలు… తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే తెలంగాణ వచ్చేసరికి… చాలామంది ఉద్యమ నేతలు టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేసరికి… ఉద్యమంలో పాల్గొని నేతలంతా చేరిపోయారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వారే కీలకంగా మారిపోయారు.

ఆఖరికి ఈటల రాజేందర్ లాంటి నాయకుడుని బయటకెళ్లెలా చేశారు. అంటే టీఆర్ఎస్‌ ఏ నాయకులకు ప్రాధాన్యం ఉందో క్లియర్‌ కట్‌గా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ వలస నేతలని అందలం ఎక్కించి… ఉద్యమ నేతలని సైడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే విషయంలో కూడా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ జరగనున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్‌కు ఫుల్ మెజారిటీ ఉండటంతో ఆరు స్థానాలు టీఆర్ఎస్‌కే దక్కనున్నాయి.

ఈ ఆరు స్థానాల కోసం టీఆర్ఎస్‌లో అనేక మంది నేతలు పోటీ పడుతున్నారు. ఇక ఇందులో ఇటీవలే పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వనున్నారని తెలిసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి సిఫార్సు చేసినా సరే… గవర్నర్ కౌశిక్‌కు ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలో బ్రేక్ వేశారు. దీంతో కౌశిక్‌ని ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ చేయనున్నారని తెలుస్తోంది. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేసే ఛాన్స్ ఉంది. అటు మధుసూదనాచారికు కూడా ఎమ్మెల్సీ పదవి ఖాయమైంది. కడియం శ్రీహరి, రవీందర్ రావు, కోటి రెడ్డి, ఎల్ రమణలకు పదవులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా పదవులు ఆశించే లిస్ట్ పెద్దగానే ఉంది.

అయితే ఇందులో ఎంతమంది వలస నేతలు ఉన్నారో అందరికీ తెలుసు. కానీ ముందు నుంచి టీఆర్ఎస్‌లో కీలకంగా ఉంటూ, ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్న కర్నె ప్రభాకర్‌కు టీఆర్ఎస్ అధిష్టానం మొండిచేయి చూపించింది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. మొత్తానికైతే టీఆర్ఎస్‌లో ఉద్యమ నేతలకు పెద్దగా ప్రాధాన్యత లేదని అర్ధమైపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version